అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణం

Mar 4,2024 21:23

ప్రజాశక్తి- రేగిడి : రాజాం మున్సిపాలిటీ బొబ్బలి సెంటర్‌లో ఆదివారం రాత్రి మర్రిచెట్టు కూలి కొండంపేటకు చెందిన ముద్దన శ్రీనివాసరావు మృతి చెందారని ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే కారణమని సిఐటియు నాయకులు సిహెచ్‌ రామమూర్తి నాయుడు అన్నారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన కాలం చెల్లిని చెట్లను అధికారులు ఉంచడంతో ఆ చెట్టు నేలకు ఒరిగి శ్రీనివాసరావు మృతి చెందడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి రూ. 25లక్షలు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే సిఎం రిలీఫ్‌ ఫండ్‌ వచ్చేలా కృషి చేస్తామని సిఐ డి.మోహన్‌రావు, తహశీల్దార్‌ హామీ ఇచ్చారు. రోడ్డున పడ్డ శ్రీనివాసరావు కుటుంబంసంకిలి షుగర్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మర్రి చెట్టు కూలి మృతి చెందడ ంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇద్దరు పిల్లలతో ఎలా బతికేదని భార్య రోదన చూపరులను కంటతడి పెటించింది.

➡️