ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్లు పంపిణీ 

Dec 8,2023 20:36

 ప్రజాశకి-విజయనగరం టౌన్‌:  డిసెంబర్‌ 15నుంచి జరగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కు క్రీడా కిట్లును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో క్రీడా సామాగ్రిని సచివాలయాల వారీగా అయా సచివాలయ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పండగ వాతావరణంలో గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఐదు క్రీడా అంశాల్లో నిర్వహిస్తోందన్నారు. సుమారుగా రూ.50 కోట్లతో ఖర్చుతో పోటీలను నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహద పడతాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిఎస్‌డిఒ అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️