శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ

కదిరి (అనంతపురం) : కదిరి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పై ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపాన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సోమవారం భూమి పూజ చేశారు. ముందుగా భూమాతకి నారికేళి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం నాయకులు రమేష్‌, ఏనుగుల రమణ, రవి, వారి మిత్రబృందం పాల్గొన్నారు.

➡️