ఆదర్శ ప్రాయుడు శ్రీపొట్టిశ్రీరాములు

Dec 15,2023 21:48
చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
ఆదర్శ ప్రాయుడు శ్రీపొట్టిశ్రీరాములు
ప్రజాశక్తి- నెల్లూరు అర్బన్‌:ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం అమరులైన శ్రీ పొట్టి శ్రీరాములు నాటి-నేటితరాలకు ఆదర్శప్రాయులని నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని కొండ్రేడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, సిహెచ్‌ హరిబాబు యాదవ్‌, మల్లు సుధాకర్‌ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌ రెడ్డి, నగర అధ్యక్షులు సుజరు బాబు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజరు బాబు, సుందర్‌ రామి రెడ్డి, జిల్లా కార్యదర్శి అలియా, తదితరులు పాల్గొన్నారు.మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలోరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు నెల్లూరు మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఎఎంసి చైర్మన్‌ శ్రీ పెర్నేటి కోటేశ్వర రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మార్కెట్‌ కమిటీ సభ్యులు, సిబ్బంది సమక్షంలో ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమంలో మార్కెట్‌ సెక్రటరీ ఉమాపతి రెడ్డి, తాటిపర్తి వెంకటేష్‌, నవీన్‌ కుమార్‌, ఆఫీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️