ఆరోగ్య ప్రదాత సిఎం జగన్‌

Feb 2,2024 21:32
ఫొటో : ఆరోగ్య ధృపత్రాలను అందజేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఫొటో : ఆరోగ్య ధృపత్రాలను అందజేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
ఆరోగ్య ప్రదాత సిఎం జగన్‌
ప్రజాశక్తి-సీతారామపురం : రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య ప్రదాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసినేనిపల్లి సచివాలయం పరిధిలో ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సురక్షలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు, మందుల పంపిణీ తదితర క్యాంపులను పరిశీలించి రోగుల ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు ఆరోగ్య ధృపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీని రూ.25లక్షల వరకు కుటుంబానికి పెంచారని దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి, ఎంపిడిఒ భార్గవి, వైద్యాధికారిణి స్వప్న, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

➡️