ఆలయాల అభివృద్ధికి కృషి : కాకాణి

Dec 18,2023 17:25
ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఆలయాల అభివృద్ధికి కృషి : కాకాణి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరురాష్ట్రంలో ఆలయాల అభివద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక కషి చేస్తుందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం మంత్రి మండలంలోని విలుకానిపల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వినాయకుని ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆల యాల అభివద్ధికి పూర్వవైభవం తీసు కొచ్చారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు ఘాట్‌ లు నిర్మించే క్రమంలో విజయవాడలో అ త్యంత పురాతనమైన ఆలయాలను నిలువునా కూలగొట్టారని మంత్రి కాకాణి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాజీ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై సెటైర్లు వేశారు. వైసిపి నాయకులు చిల్లకూరు సుధీర్‌ రెడ్డి, కన్వీనర్‌ ఉప్పల శంకర య్య గౌడ్‌, సచివాలయాల కన్వీనర్‌ తలమంచి సురేంద్ర బాబు, వ్యవసాయ సల హా మండలి చైర్మన్‌ ప్రసూనా, మాజీ సర్పంచ్‌ ఈదూరు రామాచార్యులు ఉన్నారు.

➡️