ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ వేగవంతం

ప్రజాశక్తి -కనిగిరి : నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా మంజూరు చేసిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ తెలిపారు. కనిగిరి-1 వద్ద నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇచ్చిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియను అబ్దుల్‌ గఫార్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా గఫార్‌ లబ్ధిదారులు, సచివాలయం సిబ్బంది మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించే ఏర్పాటు చేసిందన్నారు.వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి వారికి సర్వ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ రిజిస్ట్రేషన్‌ డాకుమెంట్‌ ద్వారా బ్యాంకులలో లోన్లు పొందే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులందరూ జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్‌ అశోక్‌, విఆర్‌ఒ నాగరాజు, బ్రహ్మరెడ్డి, రామాంజనేయులు, కౌన్సిలర్‌ రమణబోయన ప్రశాంతి శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్‌ జానీ, లబ్ధిదారులు పాల్గొన్నారు. హనుమంతునిపాడు : నవరత్నాలు,పేదలందరికీ ఇళ్లుపథకం ద్వారా మంజూరు చేసిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి ఎంపిడిఒ కష్ణారావు తెలిపారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇఒఆర్‌డి షరీఫ్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

➡️