ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

ప్రజాశక్తి – కడప ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్‌రెడ్డి తక్షణం నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో భాగంగా మూడవరోజు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కడప నగరపాలక సంస్థ ఎదుట చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఉద్యోగాల పర్మినెంట్‌, పనికి తగ్గ వేతనంతోపాటు మున్సిపల్‌ రంగంలోని ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, మలేరియా, పార్కులలో పనిచేసే కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌, వాటర్‌ సప్లరు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కార్మికులకు కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాల చెల్లింపు చేయాలన్నారు. సర్టిఫికెట్స్‌ లేవనే సాకుతో ఇంజినీరింగ్‌ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ . జీతాలు , క్లాప్‌ డ్రైవర్లకు రూ. 18 500 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ కార్మికులకు సంబంధించి సరెండర్‌ లీవులు, తదితర సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8న మున్సిలపల్‌ శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూల సురేష్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి సి అండ్‌ డిఎంఏ పి కోటేశ్వరావుకు సమ్మె నోటీసు ఇచ్చారని చెప్పారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలుచేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా సమ్మెను నివారించేందుకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నగర అధ్యక్షులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్న సమ్మెకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మిక సంఘాలు మద్దతునిచ్చి తోడ్పాటును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మైదుకూరు : మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఆధ్వర్యంలో గురువారం మైదుకూరులో మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్‌ చేయాలన్నారు. పెరిగిన నిత్యవసర ధరల మేరకు కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలన్నారు. సిపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఓపిస్‌ పెన్షన్‌ అమలు చేయాలని, కోవిడ్‌ -19 కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు ట్రెజర్‌ జి చిన్న, లక్ష్మయ్య, కటసుబ్బయ్య, పుల్లమ్మ, విశ్వనాథం పాల్గొన్నారు. జమ్మలమడుగు : మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజరు కుమార్‌ ,సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక మస్టర్‌ పాయింట్‌ వద్ద చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శేఖర్‌, జిల్లా కమిటీ సభ్యుడు నాగన్న, ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ బాధ్యుడు వినరు కుమార్‌ మరియు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్‌ కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి మూడవరోజుకు చేరుకుంది. కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మిక సంఘ (సిఐటియు అనుబంధం) గౌరవాధ్యక్షులు పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులనందరినీ పర్మినెంట్‌ చేయాలన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంటి, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, ప్రమీలమ్మ, గుర్రమ్మ, రమాదేవి, నీతమ్మ, శాంతి, మరియమ్మ, నర్సమ్మ, అన్నపూర్ణ, మోహన్‌, ఓబయ్య, సురేష్‌, జాకోబు, సుధాకర్‌, లంకా రవి పాల్గొన్నారు. సమ్మెకు జనసేన నాయకులు జిలాని బాష, లక్షణ్‌ సింగ్‌, ప్రసాద్‌ మద్దతు తెలిపారు.

➡️