ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమవుతుందని అంబవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ముప్పాళ్ళ చంద్రశేఖర్‌ (చందు) అన్నారు. అంబవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఉన్నత ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పాఠశాల అవసరాల నిమిత్తం రూ.6 వేల నగదును ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావుకు అందజేశాడు. పాఠశాలకు జిరాక్స్‌ కం ప్రింటర్‌ను ఇవ్వనున్నట్లు, అలాగే 10వ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.10,000 బహుమతి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. మరో పూర్వ విద్యార్థి ఎంఆర్‌ శ్రీనివాసులు పాఠశాలకు సౌండ్‌ బాక్స్‌, మౌత్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అర్‌ హనుమంతరావు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి గుంటిమడుగు కృష్ణంరాజు, మాజీ సర్పంచ్‌ అద్దంకి రమణయ్య, లైబ్రరీ నర్సరాజు, పూర్వ విద్యార్థి ఎంఆర్‌ శ్రీనివాసులు, సిఆర్‌ఎంటి డివి నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️