ఇసుక మాఫియాను అడ్డుకోవాలి

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) ప్రభుత్వ అధికారులు ఇసుక మాఫియాను అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నెహ్రూ రోడ్డు లోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ఇసుకమాఫియా చెలరేగిపోతోందని అన్నారు. అరికట్టాల్సిన ఉన్నతాధికారులు కట్టడి చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై దాడి జరిగిన సంఘటన బాధాకరమన్నారు. నేడు అటవీశాఖ జీపును తగిలించిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకే భద్రతలు లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. గత నెలలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి కడప ఎస్‌పి దగ్గరకు తన మంది మర్భాలంతో వెళ్లి ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరారనిచెప్పారు. ప్రొద్దుటూరు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చిన బిగ్‌ బాస్‌ ఎమ్మెల్యేనన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండా ప్రొద్దుటూరు అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. 11 రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు ధర్నా చేస్తుంటే వారి న్యాయమైన కోరికలు వినే సమయం కూడా ముఖ్యమంత్రి లేకుండా ప్యాలెస్‌కు పరిమితమయ్యారన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెంకట కొండయ్య, వద్ది బాలుడు, టిడిపి మాజీ పట్టణాధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️