ఈ-పంట నమోదు పరిశీలన

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలు అన్ని ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల పరిధిలోని నాయుడు పల్లి గ్రామంలో జరుగుతున్న ఈ పంట నమోదు పక్రియను ఆయన పరిశీలించారు. ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా రైతులకు పథకాలన్నీ అమలవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ దేవిరెడ్డి శ్రీనివాసులు, నాయుడుపల్లి వీఏఏ పావనేశ్వరి, నాయుడుపల్లి రైతులు పాల్గొన్నారు.

➡️