ఉత్తమ పురస్కారానికి మంగారాణి ఎంపిక

Dec 8,2023 23:54
బోధిస్తూ ఏడు కోట్ల 55

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

స్థానిక శ్రీ నాగరాజా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న మోటూరి మంగారాణి సామాజిక మాధ్యమ ఉత్తమ ప్రభావశాలి పురస్కారానికి ఎంపిక య్యారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఎండ్‌ నౌ డిజిటల్‌ మీడియా సంస్థ హైద్రాబాద్‌, టి.హబ్‌లో డిసెంబర్‌ 17న నిర్వహించే కార్యక్రమంలో మంగారాణికి ఈ పురస్కారం అందుకోనున్నారు. ”మంగారాణి లెస్సన్స్‌’ పేరుతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వీడియో పాఠాలు బోధిస్తూ ఏడు కోట్ల 55 లక్షలకు పైగా వ్యూయర్షిప్‌ సాధించిన సంగతి విదితమే.

➡️