ఉద్యోగుల సంక్షేమానికి కృషి : బూచేపల్లి

ప్రజాశక్తి- దర్శి : ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. స్థానిక శ్రీకరం ఫంక్షన్‌హాల్‌లో ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ రఘురామయ్య, రమాదేవి, ఉపాధ్యాయులు ఖాదర్‌ మస్తాన్‌, రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం 8వ వార్డులో నిర్వహించిన మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు శివప్రసాద్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం శివ ప్రసాదర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కౌన్సిలర్లు మోహన్‌రెడ్డి, వీసీరెడ్డి, జ్యోతి, నాయకులు శివారెడ్డి, నరసింహారెడ్డి, కేవీరెడ్డి, సద్దిపుల్లారెడ్డి, ఎంపీపీ గోళ్ళ పాటి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

➡️