ఎంపీ భరత్‌ వ్యాఖ్యలకు ఆదిరెడ్డి ఖండన

ఎంపీ భరత్‌ వ్యాఖ్యలకు ఆదిరెడ్డి ఖండన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాజకీయాల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు .. అంతేగానీ మా వ్యాపారాల సంగతి ఎందుకని ఎంపీ భరత్‌ను ఉద్దేశించి మాజీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. హోటల్‌ జగదీశ్వరిలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రూ.3 వడ్డీలు వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే వ్యాపారం మూసేస్తామని సవాల్‌ విసిరారు. తమ జోలికొస్తే ఎంపీ వ్యవహారాల సంగతి బయట పెడతామని ఆయన హెచ్చరించారు. నీతిగా వ్యాపారం చేస్తూ అందరి దగ్గరా మంచి పేరు తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. తాను సైకిల్‌ తొక్కానని, రూ.500కు లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను, వ్యాపారం ప్రారంభించి నీతిగా చేసుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఎంఎల్‌సిగా నగరాభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయించానన్నారు. తాను మంజూరు చేయించిన పనులు కూడా ఎంపీ భరత్‌ పూర్తిచేయించ లేకపోయారని చెప్పారు. జనసేన పార్టీ నగర ఇన్‌ఛార్జ్‌ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ భరత్‌కు పది ప్రశ్నలు సంధించారు. ఈ సమావేశంలో టిడిపి నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, శెట్టి జగదీష్‌, మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, ఇన్నమూరి రాంబాబు, మిస్కా జోగినాయుడు, చాపల చిన్న రాజు, రుంకాని విజరు, బేసరి చిన్ని, మేడికొండ అప్పారావు, సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు పాల్గొన్నారు.

➡️