ఎంపీ మాగుంటకు వినతి

ప్రజాశక్తి-కొండపి: మండల పరిధిలోని మిట్టపాలెం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లు ఎంపిడిఒ తమను తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకొనేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కోరారు. సోమవారం ఎంపీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తాము బాధ్యతాహితంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఎంపిడిఒ రాజకీయ నాయకులు మాటలు విని తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వివాహ వేడుకల్లో ఎంపీ మండల పరిధిలోని మిట్టపాలెం గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు మండల మాలకొండయ్య సోదరుడు కుమారుడు అశోక్‌కుమార్‌, సుప్రజ వివాహ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, సొసైటీ అధ్యక్షుడు బి.ఉపేంద్రచౌదరి, వైసిపి నాయకులు బొక్కిసం సుబ్బారావు, దివి శ్రీనివాసులు, యువ నాయకులు రాజీవ్‌చౌదరి, గొట్టిపాటి మురళి, మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️