ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలుగా ఎంవిజిఆర్‌, జెఎన్‌టియు ప్రతిపాదనలు

Jan 5,2024 20:04

  ప్రజాశక్తి-విజయనగరం :  వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఇవిఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం శుక్రవారం కలెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించారు. ఎంవిజిఆర్‌ కళాశాలలో 5 నియోజక వర్గాలకు , జె.ఎన్‌టియులో రెండు నియోజకవర్గాలకు సంబంధించి శాసన సభ, పార్లమెంట్‌కు ఒకే చోట స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌కు వీలుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాలను కలెక్టర్‌ కోరారు. రెండు చోట్ల రూము లను తనిఖీ చేశారు. అన్ని రూము లలో లైట్లు, గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, టాయిలెట్స్‌ నీటి సరఫరా ఉండాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వీలున్నంతవరకు వేరేగా ఉండేలా చూడాలన్నారు. ఇంకోసారి పరిశీలించిన తర్వాత ఫైనలైజ్‌ చేస్తామని, తర్వాత అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయవలసి ఉంటుందని యాజమాన్యాలతో చెప్పారు. ఎంవిజిఆర్‌లో డైరెక్టర్‌ సీతా రామ రాజు, మోహన్‌, జెఎన్‌టియు లో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకట సుబ్బయ్య ఎన్నికల కోసం అవసరమైన గదులను, రూట్‌ మ్యాప్‌లను కలెక్టర్‌ కు చూపించారు. కలెక్టర్‌ వెంట జెసి మయూర్‌ అశోక్‌ , డిఆర్‌ఒ అనిత, ఆర్‌డిఒ సూర్య కళ, తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️