ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి : కలెక్టర్ కృతికా శుక్లా

Feb 26,2024 17:31 #collector, #Kakinada

ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ సాధారణ ఎన్నికల లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుపై ఎమ్ సి సి, వ్యయం పరిశీలకులు, వి ఎస్ టి, వి వి టి , ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి టిము లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఎమ్ సి సి, వ్యయ పరిశీలకులు, వి ఎస్ టి, వి వి టి , ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి ల పాత్ర చాలా ముఖ్యం అని అన్నారు. ఈ టీములు ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ను నిష్పక్షపాతంగా అమలు చేయాలని సూచించారు. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఈ సీ ఐ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లో తెలియజేయడం జరిగిందని, ప్రతి దానిని నిష్పక్షపాతంగా అమలు చేయవలసి ఉందని కలెక్టర్ అన్నారు. ఎమ్ సి సి అమలు పై ప్రతిరోజు నివేదికలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సి. విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చనని పిర్యాదు వచ్చిన 24 గంటల లోపల ఆర్వో ఆ పిర్యాదులకు నివేదికలు ఈ సీ ఐ కి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని టీములు ఈ ఎస్ ఎం ఎస్ ద్వారా మాత్రమే రిపోర్టులు, నివేదికలు పంపించాలని సూచించారు. గతంలో రిపోర్టులు మాన్యువల్ గా పంపించేవారని ప్రస్తుతం మాన్యువల్ గా ఆదేశాలు ఇవ్వడం గానీ రిపోర్టులు పంపించడం గాని అన్ని ఈ ఎస్ ఎం ఎస్ ద్వారానే జరుగుతాయని ఈ ఎస్ ఎం ఎస్ నిర్వహణ ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వహించడం నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఎన్నికల అధికారికి ఈ ఎస్ ఎం ఎస్ నిర్వహణకు ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుందని ఆ లాగిన్ ద్వారానే ఆదేశాలు వస్తాయని నివేదికలు కూడా పంపించ వలసి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ ఎస్ ఎం ఎస్ మొబైల్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీనిని డౌన్లోడ్ చేసుకుని అధికారి హోదా, మొబైల్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి లాగిన్ ను ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో ఎం సి సి నోడల్ అధికారి, డి పీ ఒ భారతి సౌజన్య, ఐటీ నోడల్ అధికారులు యన్ ఐ సి డి ఐ ఓ సుబ్బారావు, ట్రైనింగ్ నోడల్ అధికారి, కాకినాడ డీఎల్ డి వో నారాయణమూర్తి , పెద్దాపురం డి ఎల్ డి ఓ ప్రసాదరావు, ఎం సి సి టిమ్ సభ్యులు, ఎన్నికల వ్యయం పరిశీలకులు , ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి టిమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️