ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన

Jan 3,2024 23:22
వేతన సవరణ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

వేతన సవరణ చర్చలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బుధవారం డివిజనల్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యమ్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మెండు కోదండరామ్‌ మాట్లాడుతూ గత 18 నెలలుగా బకాయి ఉన్న వేతన సవరణ, సిబ్బంది నియామకాలు తదితర సమస్యలపై వెంటనే చర్చలకు యూనియన్‌లను పిలవాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఒక గంటపాటు సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పి.సతీష్‌, ప్రసాద్‌, అశోక్‌, షఫీ, యానాది శెట్టి, బివి.కళ్యాణ్‌, కాళీ వర ప్రసాద్‌, బొక్క శ్రీనివాస్‌, పట్నాయక్‌, పిఎస్‌ఎన్‌.రాజు, శిరీష, రాజకుమారి, మహతి, పాల్గొన్నారు.

➡️