ఎస్‌పికి ప్రతిష్టాత్మక పురస్కారం

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌

జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ప్రతిష్టాత్మక డిజిపి డిస్క్‌ కమెండేషన్‌ అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు అదుపు చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా ఎస్‌పిలకు రాష్ట్ర డిజిపి ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎస్‌పి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆమెకు దిశ పోలీస్‌ స్టేషన్లను అత్యంత క్రమబద్ధీకరించి నడిపినందుకు అందించారు. ఈ అవార్డును ఆమె డిజిపి కార్యాలయం మంగళగిరిలో శనివారం అందుకున్నారు.

➡️