ఎస్మా జీవో2ను రద్దు చేయాలి : సిఐటియు

Jan 9,2024 16:33 #Annamayya district, #CITU

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమ్మెకు, మద్దతుగా, సిఐటియు ఆధ్వర్యంలో, టోల్గేట్‌ గాంధీ విగ్రహం వద్ద ఉదయం ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వారి వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సంఘీభావంగా ధర్నా నిర్వహించామని తెలిపారు. అంగన్వాడీలకు వర్తించని, ఎస్మా చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ప్రయోగించడం, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ప్రయోగించడం, అని దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌, సిఐటియు అనుబంధం, జిల్లా అధ్యక్షులు శ్రీ లక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి , అధ్యక్షురాలు, శ్రీరమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి. పద్మావతి, వెన్నెల,దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఏఐటీయూసీ నాయకులు సరోజ నిర్మల నాగమణి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం. జిల్లా అధ్యక్షులు, ఎం. జయరామయ్య, సిపిఎం మండల కార్యదర్శి, లింగాల యానాదయ్య, సిఐటియు, మండల కోశాధికారి, కరతోటి హరి నారాయణ, సిఐటియు, మండల సహాయ కార్యదర్శి, ముత్యాల శ్రీనివాసులు, ఏపీ ఎం డి సి , మైనింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌, అధ్యక్షులు పూలగంటి. శ్రీనివాసులు, శంకర్‌ రాజు, సురేంద్ర, శ్రీనివాసులు రెడ్డి, కెవిపిఎస్‌, నాయకులు, నాగిపోగు పెంచలయ్య, ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘ నాయకులు, హరి,శివ వర్మ, బిల్డింగ్‌ వర్కర్స్‌ నాయకులు, కేశవులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు, బొజ్జ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️