ఇండోనేషియాలో భారీ వర్షాలు – 28 మంది మృతి

May 13,2024 07:33 #floods, #Indonesia, #landslides

జకర్తా : ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సంభించిన వరదలు, కొండచరియలు విరిగిన ఘటనల్లో 28 మంది చనిపోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలిపారు. వరదల కారణంగా శనివారం రాత్రి నుంచి నివాస ప్రాంతాల్లో భారీ స్థాయిలో బురద కొట్టుకొచ్చినట్లు పేర్కొన్నారు. కనీసం ఐదు జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలకు సుమారు 84 ఇళ్లు, 16 వంతెనలు ధ్వంసమయ్యాయని ప్రకటించింది.

➡️