ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసులపై విచారణ

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలంలో ఇటీవల నమోదైన ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసులను ఒంగోలు డిఎస్‌పి వి. నారాయణస్వామి రెడ్డి గురువారం విచారించారు. తొలుత పంచాయతీ కార్మికుడు నరసింహపై దాడి ఘటనలో నమోదైన ఆట్రాసిటీ కేసులోనిసాక్షులను విచారించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కొండపి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాపూరి ప్రభావతి కేసుకు సంబంధించిన తిరుమల పట్టాభినగర్‌కు వెళ్లి విచారించారు. అనంతరం బింగినపల్లిలో ఇటీవల గిరిజన బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ గురించి విచారించి వివరాలు సేకరించారు. డిఎస్‌పి వెంట సిఐ దాచేపల్లి రంగనాథ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు. బాధితుడికి న్యాయం చేయాలి గ్రామపంచాయతీ కార్మికుడు నరసింహపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు టంగుటూరి రాము, కెవిపిఎస్‌ నాయకులు వేసుపోగు మోజెస్‌, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా నాయకులు రావినూతల కోటి మాదిగ తదితరులు డిఎస్‌పిని కోరారు.

➡️