ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలు : కూన

Mar 21,2024 16:42 #coments, #srikakulam, #TDP, #YCP government

ప్రజాశక్తి-ఆమదాలవలస(శ్రీకాకుళం): సిఎం జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్‌ కూన రవికుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని తోటాడ, అక్కివరం పంచాయతీ లలో శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని తద్వారా అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి స్కీంల పేరిట స్కాములు చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. శ్యాండ్‌, ల్యాండ్‌, మద్యం పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్‌ పేడాడ రామ్మోహనరావు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పైడి మురళీమోహన్‌, టిడిపి మండల నాయకులు నూక రాజు, సనపల ఢిల్లేశ్వరరావు, తమ్మినేని చంద్రశేఖర్‌, హనుమంతు బాలకృష్ణ, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

➡️