కడపలో ఎన్నికల వేడి

కడపలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది. ఇటీవల ప్రతిపక్ష, అధికార వైసిపి అభ్యర్థుల అనుచరులు ఫ్లెక్సీల చించివేతల దగ్గర నుంచి భౌతిక దాడులు, హత్యాయత్నాల పరంపర ఘటనలు హాట్‌ టాఫిక్‌గా మారాయి. టిడిపి అసెంబ్లీ ఇన్‌ఛార్జి ఆర్‌.మాధవి తనదైన శైలిలో అగ్రెసివ్‌ రాజకీయం చేయడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. అధికార పక్ష వైసిపి అభ్యర్థి, ప్రత్యర్థి మహిళనే భావనతో ఎదురు దాడికి తంటాలు పడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. అధికార వైసిపి అభ్యర్థిగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, టిడిపి అభ్యర్థిగా భావిస్తున్న మాధవి మధ్య పదునైన విమర్శల నేపథ్యం చర్చనీయాంశంగా మారింది.ప్రజాశక్తి-కడప ప్రతినిధిరెండు దఫాలుగా అంజాద్‌బాషా గెలిచి తిరుగులేని రాజకీ య ఆధిపత్యాన్ని నెరిపిన సంగతి తెలిసిందే. గత టిడిపి అభ్య ర్థుల ప్రచారం మొదలుకుని ఎత్తు గడలకు భిన్నంగా ప్రస్తుత టిడిపి కడప ఇన్‌ఛార్జి ఆర్‌.మాధవి తనదైన అగ్రెసివ్‌ రాజకీయంతో అధి కార పార్టీని సవాల్‌ చేస్తుండడం చర్చనీ యాంశంగా మారింది. వైసిపి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను అధి కారికంగా విడుదలకు ముందే ఇటువంటి తరహా రాజకీ యం నడవడం పలువురిని ఆకర్షిస్తోంది. టిడిపి అసెంబ్లీ ఇన్‌ఛార్జి హోదాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. పదేళ్లలో అధికార పార్టీ అభ్యర్థి చేసిన అభి వృద్ధి పనుల తీరుపై విమర్శల గుప్పిస్తోంది. భూ కబ్జాలను, అక్ర మాలను ఎండ గడుతూ డిప్యూటీ సిఎంపై పదునైన విమర్శలు చేస్తోంది. ఆ విమర్శలకు అధికార పార్టీ సమాధానం చెప్పకోవల్సిన దుస్థితిలోకి జారుకుంది. టిడిపి విమర్శలకు ప్రతిగా డిప్యూటీ సిఎం శిబిరం నుంచి ప్రతి విమర్శలు, సవాళ్లు షరామాములుగా మారాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు పరిధిని దాటిపోయాయి. విమర్శల పరిణామాల అనంతరం ఫ్లెక్సీల చించివేత వరకు పరిస్థితి చేరుకుంది. వైసిపి కార్పొరేటర్‌ అనుచరునిపై టిడిపి హత్యాయత్నానికి పాల్ప డిందనే ఆరోపణ ఉలికిపాటుకు గురి చేసింది. హత్యాయత్న ఘటనపై టిడిపి కౌంటర్‌ అటాక్‌ చేసినప్పటికీ వర్కవుట్‌ కాలేదని తెలు స్తోంది. ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి కేడర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట బైటాయించడం, పరస ర్పరం విమర్శలు గుప్పించుకోవడంతో రాజకీ యవేడి పతాకస్థాయికి చేరుకుంది. కడప అసెంబ్లీలో ముస్లిము ఓటర్లు 70 వేల వరకు ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో ముస్లిము యువకునిపై హత్యాయత్నం ఘటన తరహా ఫ్యాక్షన్‌ తరహా రాజకీయాన్ని ముస్లిమ్‌ సా మాజికవర్గం ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.టిడిపిని గ్రూపుల బెడద వేధి స్తోంది. అసమ్మతి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం తలకు మించిన వ్యవ హారమనే వాదన వినిపిస్తోంది. సీనియర్‌ నాయకులైన లకీëరెడ్డి అనుచరుల్లో కొందరిని చేరదీయడం రెచ్చగొట్టినట్లు అవుతుందనే వాదన వినిపిస్తోంది. కడప అసెంబ్లీలో ముస ి్లముల తరువాత బలిజ సామాజికవర్గ ఓటర్లు సుమారు 30 వేల నుంచి 50 వేల మంది ఉన్నారు. ముస్లిమ్‌ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు అమీర్‌బాబు, బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి రామచంద్రయ్యను కలుపుకుంటే గట్టి పోటీ ఇవ్వగలిగే అవకాశం ఉందని చెప్ప వచ్చు. అధికార పార్టీ అభ్యర్థిపై అగ్రెసివ్‌ రాజకీయం నెరిపిన తరహాలో టిడిపిలోని గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకు రావా ల్సిన అవసరం ఉంది. ఇటువంటి తరహా పరిణామాల పరంగా ఇప్పటివరకు ఒక్క అడు గూ ముందుకు పడకపోవడం గమనార్హం.

➡️