కరువు మండలంగా ప్రకటించాలని వినతి

తహశీల్దారు రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నేతలు

ప్రజాశక్తి-కె.కోటపాడు

కె.కోటపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యాన మంగళవారం మండల తహశీల్దారు రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, మండల కార్యదర్శి వనము సూర్యనారాయణ, ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, సిఐటియు నాయకులు ఈర్లె నాయుడుబాబు మాట్లాడుతూ మండలంలో 30 శాతం వరినాట్లు వేయలేదని, సాధారణ వర్ష పాతం కన్నా 20 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని తెలిపారు. నీటి వసతి ఉన్నచోట రైతులు అనేక ఇబ్బందులు పడి వరి నాట్లు వేయగా, క్రిమి కీటకాల వలన అధిక భాగం వరి పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సకాలంలో వర్షాల కురవక, విద్యుత్‌ సరఫరా అంతంత మాత్రమే ఉండడం వలన నాటిన వరి పంటలు పూర్తిగా పండలేదన్నారు. కొద్దిగా పండిన పంటలు ఈ తుఫాను ప్రభావం వల్ల తడిసిపోయి, ఈదురు గాలులకు వరి చేను నేలకొరిగినట్లు చెప్పారు. తడిసిన ధాన్యం మొలకలెత్తే ప్రమాదముందన్నారు. ఈ విధంగా రైతు ఈ ఏడాది అన్ని విధాలుగా నష్టపోయారని, కావునా, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️