కలిసికట్టుగా పోరాటం

Jan 9,2024 16:10 #anatapuram, #Anganwadi strike, #CITU
  • మున్సిపల్‌ అంగన్వాడి కార్మికుల మానవహారం
  • ఎస్మా చట్టం ఎత్తివేయాలని నినదించిన కార్మికులు
  • జైలు భరో కార్యక్రమం విజయవంతం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం ఎత్తివేయాలని మున్సిపల్‌ అంగన్వాడీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి టవర్‌ క్లాక్‌ వద్ద మానవహారం నిర్మించారు వివిధ కార్మిక సంఘాల ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. ర్యాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి బయలుదేరి సప్తగిరి సర్కిల్‌ సుభాష్‌ రోడ్డు మీదుగా టవర్‌ క్లాక్‌ చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ,ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు అంగన్వాడి టీచర్లు తమ సమస్యలు పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలని నీరు కార్చే విధంగా ఎస్మా చట్టాన్ని తెచ్చి పోలీసులు అడ్డం పెట్టుకొని పోరాటాలని అణచివేయాలని, కార్మికులను అంగన్వాడి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా తెచ్చిన ఈ ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే మరింత మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా మున్సిపల్‌ ఆఫీస్‌ దగ్గర నుండి ప్రదర్శన ప్రారంభమై టవర్‌ క్లాక్‌ దగ్గర అరగంటసేపు మానవహారం ఏర్పడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడం సాధ్యం కాదని తెలియజేయగా అందరూ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కి ప్రదర్శన ద్వారా వెళ్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద కూర్చుని ఆందోళన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షురాలు నాగమణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్‌ గౌడ్‌, ఐ ఎఫ్‌ టి యు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, టి ఎన్‌ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహులు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె నాగభూషణ, సిఐటియు నగర రెండు కమిటి ల అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌ నారాయణ ,గురు రాజా ,ముత్తుజ, సిపిఎం పార్టీ నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌ వి నాయుడు, అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శకుంతల రమాదేవి గారు, మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు బండారిఎర్రి స్వామి, తిరుమలేష్‌, ఇంజనీరింగ్‌ విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున సంజీవ రాయుడు మరియు నగర అధ్యక్ష కార్యదర్శులు మురళి ఓబుళపతి కోశాధికారి పోతులయ్య ఐద్వా నాయకురాలు లక్ష్మీదేవి టి ఎన్‌ టి యు సి మహిళా నాయకురాలు మున్సిపల్‌ అంగన్వాడి కార్మికులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.

➡️