కాంపౌండర్లు, నర్సుల సమస్యలపై వినతి

ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

చిలకలూరిపేట: రాష్ట్రంలో వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు ఏడు లక్షలకు పెగా కాంపౌండర్‌, నర్సులుగా పని చేస్తున్నారని రాబోయే కాలంలోనైనా వారికి కనీస భద్రత కల్పించాలని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు కోరారు. మాజీ మంత్రి, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావును ఆదివారం పండరీపురంంలోని ఆయన నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంపౌండర్లు, నర్సులతో ఆయా ఆసు పత్రుల యాజమాన్యం వెట్టిచాకిరి చేయించుకుంటూ, అమా నుషంగా ప్రవ ర్తిస్తు న్నారని, ప్రశ్నించిన ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలిగిస్తున్నారని అన్నారు. ఆసుపత్రులలో నర్సు లుగా కొనసాగే వారందరూ బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలకు చెందిన వారే కాక పేదలు,నిరుపేద లు, కొద్ది పాటి చదువు ఉన్న వారే ఉన్నట్లు చెప్పారు. కరోనా కాలంలో వారు ఎక్కువగా కష్ట పడ్డారన్నారు. ప్రభుత్వాలు వారికి కనీస సదుపాయాలు కల్పించ లేదని, కాంపౌండర్స్‌,నర్సులకు తగిన న్యాయం చేయాలని కోరు తూ ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. పుల్లారావు మాట్లాడుతూ వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.కార్యక్రమంలో ఎ.వెంకట్‌, జి.నరసింహారావు, మొహిద్దిన్‌, వినోద్‌, బి. నాగరాజు పాల్గొన్నారు.

➡️