కాంప్లెక్స్‌ సమావేశాలు బోధనా సామర్థ్యాలను పెంచుతాయి

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు ఉపాధ్యాయులలో బోధనా సామర్థ్యాలను పెంపొందిస్తాయని సిఎస్‌ పురం స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ షేక్‌ ఖాదరున్నీసా బేగం అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలుగు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ సమావేశం జరిగింది. సమావేశాలలో నేర్చుకున్న అంశాల ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించి విద్యాభివృద్ధి సాధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పీసీపల్లి, పామూరు, సిఎస్‌ పురం మండలాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️