కృష్ణానగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణానగర్‌లో డ్రైనేజీ నిర్మాణ

‘ప్రజాశక్తి’ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

రెండున్నరేళ్ల తర్వాత పనుల్లో కదలికపై హర్షం

ప్రజాశక్తి- వేపగుంట : జివిఎంసి 94వ వార్డు కృష్ణానగర్‌లోని మూడుగుళ్ల వీధిలో డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్ల క్రితమే నిధులు మంజూరైనా, పనులు చేపట్టకపోవడంతో మురుగునీరు, దుర్గంధంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 12న ప్రజాశక్తిలో ‘నిధులు మంజూరైనా నిర్మాణ పనుల్లో జాప్యం’ శీర్షికతో ప్రజాశక్తిలో వెలుగులోకి తేవడంతో స్థానిక ఎమ్మెల్యే, అదీప్‌రాజ్‌ స్పందించారు. నిధులు మంజూరై రెండున్నరేళ్లు దాటిపోవడంతో దానిపై పరిశీలన జరిపి, నిధులింకా ఉండడంతో దీనికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజాశక్తి కథనంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

➡️