కేలండర్‌ ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్‌

ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

పల్నాడు జిల్లా: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో సంవత్సర తెలుగు/ ఆంగ్ల కేలండర్‌ ఎగ్జిబిషన్‌ ను జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి సోమవారం ప్రారంభించారు. కేలండర్‌ చరిత్రతో 12 నెలల తెలుగు/ఆంగ్ల కేలండర్‌ ను ఉపయోగించి రూపొందించిన క్యాలెండర్‌ వివరాలతో ఎగ్జిబిషన్‌ లో ప్రదర్శించారు. తెలుగు పదాలైన కేలండర్‌ లో చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణం వరకు అన్ని నెలలను కలుపుకొని, ఆంగ్ల మాసాలను కలుపుతూ వివరాలతో రూపొందించిన ఈ కేలండర్‌ బాగుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆంగ్ల, జూలియన్‌, హిందూ,్‌, హిజ్రీ/ఇస్లామిక్‌, బౌద్ధ , జపనీస్‌ ్‌, చైనీస్‌, హిబ్రూ కేలండర్లతో రూపొందించిన చిత్రాలను ఎగ్జి బిషన్‌ లో ప్రద ర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌ను పలువురు ఆసక్తిగా తిలకించారు.

➡️