కోలగట్ల ఎన్నికల ప్రచారం

Mar 29,2024 20:01

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరంలోని 6వ డివిజన్‌ సిఆర్‌ కాలనీ, ఆనంద నగర్‌ కాలనీల్లో వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేనకు చెందిన పలువురు వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆరవ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆల్తి సత్య కుమారి మాట్లాడుతూ వీరభద్ర స్వామి గెలుపు ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. నిత్యం నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన కృషి చేశారన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే నాయకులను పక్కనపెట్టి నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉండే కోలగట్ల వంటి నాయకుడికి పట్టం కడితే మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, జోనల్‌ ఇన్చార్జిలు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, రెడ్డి గురుమూర్తి, ఐదో డివిజన్‌ కార్పొరేటర్‌ గాదం మురళి, వైసీపీ నాయకులు కెఎపి రాజు, ఆల్తి శ్రీనివాసరావు, చిన్ని కృష్ణ, పొంతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

➡️