క్రీడలకు పెద్దపీట : ఎమ్మెల్యే

Jan 25,2024 20:48

 ప్రజాశక్తి-గజపతినగరం  :  ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. గురువారం గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. తొలుత క్రికెట్‌ ఆడుతూ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షటిల్‌ బ్యాడ్మింటన్‌ జాతీయ స్థాయి క్రీడాకారులు రామ్‌చరణ్‌, జాహ్నవిని దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ వి.ముత్యాలనాయుడు, ఎంపిపిలు బెల్లాన జ్ఞానదీపిక, చల్ల చల్లమనాయుడు, జెడ్‌పిటిసి గార తౌడు, ఎంపిడిఒ కె.కిశోర్‌కుమార్‌, వాణిశ్రీ, ఎంఇఒలు ఎస్‌.విమలమ్మ, సాయిచక్రధర్‌, సిఐ ఎన్‌వి ప్రభాకర్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్‌వి రమణ, సర్పంచ్‌ బెల్లాన త్రినాథరావు, ఉప సర్పంచులు మండల సురేష్‌, కర్రి రామనాయుడు, కర్రి నానాజీ పాల్గొన్నారు.బొబ్బిలి : స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఆడుదాం-ఆంధ్రా ఆటల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండోరోజు గురువారం కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీలను ఎంపిడిఒ పి.రవికుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.శృంగవరపుకోట : ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఆడుదాం ఆంధ్రా బ్యాడ్మింటన్‌ పోటీలు పోటీలను ఎంపిపి సోమేశ్వరరావు, వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుబ్బలక్ష్మి, ఎంపిడిఒ శేషుబాబు, ఎంఇఒ బి.నర్సింగ్‌రావు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో క్రీడల నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కె.కృష్ణంరాజు, మండల కోఆర్డినేటర్‌ పి.శ్రీరాములు పాల్గొన్నారు.

➡️