క్రీడలతో మానసిక ఉల్లాసం

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్‌ఐ హరిబాబు అన్నారు. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మాజీ సర్పంచ్‌ మాదాసు కృష్ణమూర్తి జయంతి, సంక్రాంతి సందర్భంగా మాదాసు కృష్ణమూర్తి మెమోరియల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్‌ పోటీలను శనివారం ఎస్‌ఐ హరిబాబుతో పాటు ఎంపిడిఓ జయమణి, తహశీల్దారు సుజన్‌ కుమార్‌ ప్రారంభించారు. గెలుపు ఓటములు సహజమని, స్ఫూర్తిగా తీసుకొని ఆడుకోవాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తొలుత మాదాసు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాదాసు రాంబాబు, పెంట్యాల శ్రీనివాసరావు, సర్పంచ్‌ దేవరకొండ జయమ్మ, ఉపసర్పంచ్‌ పి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌ ఉప్పుగుండూరి శ్రీనివాస ప్రసాదు, ఏలీష, కొంజేటి సురేష్‌బాబు, ఎంపిటిసి మున్నంగి వెంకట్రావు, మాదాసు నాగేశ్వరావు, ఓ మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️