క్రీడా పోటీలలో విద్యార్థినుల ప్రతిభ

ప్రజాశక్తి-సిఎస్‌ పురం తిరుపతిలోని ఎస్‌వి వ్యవసాయ కళాశాల వేదికగా ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో బాలికల విభాగంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అంతర కళాశాలల క్రీడా పోటీలలో సీఎస్‌ పురం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపించి అత్యధిక బహుమతులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి వచ్చిన జిల్లా ఏఎస్పీ జె కులశేఖర్‌, ప్రాంతీయ వ్యవసాయ ఏడి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కలిసి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న కె కృపా షార్ట్‌పుట్‌లో మొదటి బహుమతి, లాంగ్‌ జంప్‌లో ద్వితీయ బహుమతి, షటిల్‌లో మొదటి బహుమతి, హైజంప్‌లో ఏ వెన్నెల ద్వితీయ బహుమతి, అదేవిధంగా 400 మీటర్స్‌ రన్నింగ్‌లో ద్వితీయ బహుమతి బి సంకీర్తన, తృతీయ బహుమతి ఎ వెన్నెల, బహుమతులు గెలుపొందారు. ఈ సందర్భంగా పోటీలలో రాణించి బహుమతులు గెలుపొందిన విద్యార్థినులకు కళాశాల వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, ఛైర్మన్‌ కెవి ప్రకాశ్‌రావు, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కదిరి పార్థసారథి, కళాశాల డీన్‌ నున్నా త్రిమూర్తులు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్స్‌ బండారు రవీంద్రబాబు, బి మౌనిక, విద్యార్థి వ్యవహారాల ఇన్‌ఛార్జి డాక్టర్‌ కుమీర తదితరులు పాల్గొన్నారు.

➡️