క్రీడా స్ఫూర్తిని చాటాలి

Jan 10,2024 21:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు సూచించారు. మండలంలోని వెంకంపేట గ్రామంలో బుధవారం ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతలను నియోజకవర్గ స్థాయికి పంపిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఆకిబ్‌ జావేద్‌, వ్యాయామ శిక్షకులు కె.తిరుపతిరావు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గుమ్మలకీëపురంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలను జెడ్‌పిటిసి మండంగి రాధిక ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట సర్పంచి ఆర్‌.చైతన్య స్రవంతి, వైస్‌ ఎంపిపి నిమ్మక శేఖర్‌, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.గిరిబాబు, ఎంపిడిఒ సాల్మన్‌రాజు, ఎల్విన్‌పేట ఎస్‌ఐ శివప్రసాద్‌, ఎంఇఒ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.కురుపాం : కురుపాంలో సాయిరాం ఆలయ మైదానంలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపిపి శెట్టి పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి జి.సుజాత, ఎంపిడిఒ ఎస్‌.అప్పారావు, సర్పంచ్‌ జి.సుజాత, ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, ఇఒ కె.చంద్రశేఖర్‌, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, ఎంపిటిసిలు వి.బంగారునాయుడు , స్వామియోజులు , సంతోషి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె.సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.సీతంపేట : మండలంలో ఎన్‌టిఆర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియంలో మండల స్థాయి ఆడదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారు. పోటీలను ఎంపిపి బి.ఆదినారాయణ, ఎంపిడిఒ కె.గీతాంజలి పర్యవేక్షించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ ఇన్చార్జి జాకబ్‌ దయానంద్‌, పిడి లక్షణమూర్తి, కార్యదర్శులు పాపారావు, వినోద్‌, శ్యామ్‌బాబు పాల్గొన్నారు.వీరఘట్టం : స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల (బాలురు)లో మండల స్థాయి పోటీలను ప్రారంభించారు. ఎంపిడిఒ డి.శ్వేత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇఒ వి.రామచంద్రరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్‌.ఉమామహేశ్వరరావు, ఎం.రామకృష్ణ, ఎస్‌.పద్మరాజు, కె.సాల్మన్‌రాజు, తూముల మధు పాల్గొన్నారు.పాచిపెంట : పి.కోనవలస క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎంపిపి బి.ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.లక్ష్మి కాంత్‌, తహశీల్దార్‌ ఎం.రాజశేఖర్‌, గొట్టాపు ముత్యాల నాయుడు, పి.వీరమనాయుడు పాల్గొన్నారు.

➡️