క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ నేషనల్‌ లీగల్‌ కాంపిటీషన్‌

మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి మురళీకృష్ణ

ప్రజాశక్తి-సబ్బవరం :

స్థానిక దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో లీగల్‌ ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యాన క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌-5.0 నేషనల్‌ లీగల్‌ కాంపిటీషన్‌ శనివారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాబోయే సవాళ్లు ఎదుర్కోవడం కోసం క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ యొక్క ప్రాముఖ్యత వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దర్యాప్తు అధికారి క్రైమ్‌ సీన్‌ అబ్జర్వేషన్‌లో నిందితులను గుర్తించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇటువంటి పోటీల వలన కళాశాల విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యం మెరుగుపర్చుకోవచ్చని చెప్పారు. కేసులు దర్యాప్తు, చట్టాల అమలుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్య ప్రకాష్‌రావు, ఇంచార్జ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నందిని, కో కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌.లక్ష్మి, లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్‌, పరవాడ సబ్‌ స్టేషన్‌ డీఎస్పీ కెవి.సత్యనారాయణ, స్థానిక సిఐ పిన్నింటి రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️