గిరిజనాభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ

Feb 6,2024 21:20

ప్రజాశక్తి – కొమరాడ: గిరిజనుల్లో జీవన నైపుణ్యాల పెంపునకు, స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి గిరిజన సహకార సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని దేవుకోనలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్‌ దన్‌ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. అనంతరం ఆయన ఇందిరాక్రాంతిపథకంతో కలిసి జిసిసి సమన్వయం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 415కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో జిసిసి పలు కార్యక్రమాల్లో గిరిజనులకు జీవనాధారంలో చేయూతనిస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. వన్‌ దన్‌ కేంద్రాల్లోనూ జిసిసి ఇందిరా క్రాంతి పథకంతో పనిచేస్తూ వారి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు. గిరిజనుల జీవన నైపుణ్యాలు పెంపునకు జిసిసి ఇతోధికంగా తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా వారు పండించే అటవీ వ్యవసాయ ఉత్పత్తులు వేల్యూ యాడెడ్‌ చేసి వారికి కావాల్సిన వసతులు కల్పించేందుకు ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ మహేంద్ర కుమార్‌, వెలుగు ఎపిడి సత్యంనాయుడు, మార్కెటింగ్‌ మేనేజరు శేఖర్‌, రమనమూర్తి, ప్రవీణ, జిసిసి సిబ్బంది, ఉద్యోగులు, గిరిజనులు ఉన్నారు.వందన్‌ వికాస్‌ కేంద్రాలు సందర్శించిన ఎండిమక్కువ : మండలంలోని వందన్‌ వికాస్‌ కేంద్రాలను జిసిసి ఎండి సురేష్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. మార్కొండపుట్టిలో నటరాజ్‌ పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఆయన గిరిజనుల నుండి పసుపు ఏ విధంగా సేకరిస్తున్నారు. గిరిజనులు పండించే గిరిజన ఉత్పత్తులను సేకరించి ప్రాసెసింగ్‌ చేసి గిరిజన కార్పొరేషన్‌ ద్వారా ఐకెపి సంయుక్తంగా సేకరించి గిరిజన ఆర్థిక అభివృద్ధి చేసేలా ముందుకు నడపాలని సూచించారు. గిరిజన కార్పొరేషన్‌ నుంచి ఏ విధమైన సహకారం కావాలన్నా వందన వికాస్‌ కేంద్రాల బలోపేతానికి జిసిసిని వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిసిసి జిల్లా మేనేజర్‌ మహేంద్రకుమార్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ వి.రమణమూర్తి, ప్రవీణ్‌ కుమార్‌, ఎపిఎం సన్నిబాబు పాల్గొన్నారు.

➡️