గురుకులాలకు జిసిసి చింతపండు

Mar 29,2024 21:30

 ప్రజాశక్తి – బెలగాం : పార్వతీపురం జిసిసి 2020-21 సంవత్సరంలో కొనుగోలు చేసిన సుమారు 12000 క్వింటాళ్ల చింతపండు పార్వతీపురం డివిజన్‌ పరిధిలో గల పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం గురుకులాలతో పాటు పాడేరు, చింతపల్లి, అరకు ముంచింగిపుట్టు, జి.మాడుగుల, కాశీపట్నం రకాలు కూడా టెండర్‌లో పెట్టమని పార్వతీపురం జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ వి.మహేంద్ర కుమార్‌ తెలిపారు. ఈ టెండర్‌ శనివారం ఉదయం 10 గంటల నుండి విశాఖపట్నం జిసిసి ప్రధాన కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు ఈ ఏడాది చింతపండు దిగుబడి అంత ఆశాజనకంగా లేదని, గత ఏడాది, ఈ సంవత్సరానికి జిసిసి మొత్తంగా 10వేల క్వింటాళ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. కానీ ఈ ఏడాది పంట దిగుబడి లేని కారణంగా కొనుగోలు జరపలేదని తెలిపారు పంట దిగుబడి లేని కారణంగా గిరిజనులు సేకరించిన పంటను ఎంఎస్‌పి ధర కంటే ఎక్కువగా ఎక్కడ వచ్చినా వారికి అమ్ముకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ టెండరు జిసిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిసురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

➡️