గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కృషి

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి విశ్వరూప్‌

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

తీర గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు.రూ.2 కోట్ల 60 లక్షలతో తీర గ్రామమైన ఎన్‌.కొత్తపల్లి పంచాయతీ రాఘవులపేట నుండి ఎస్‌.యానం వెళ్లే సుమారు 6 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బి తారు రోడ్డు నిర్మాణానికి శనివారం మంత్రి విశ్వరూప్‌ శంకుస్థాపన చేశారు. దశలవారీగా దెబ్బతిన్న రోడ్లను ఆధునికీకరిస్తామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, సొసైటీ అధ్యక్షులు నడింపల్లి వాసు రాజు, మాజీ సర్పంచ్‌ బొడ్డు బుజ్జి, ఆర్‌అండ్‌బి డిఇఇ, కెఎస్‌.రాఘవరావు, వైసిపి నాయకులు మోటూరి సత్యం కాపు, కుంచే చిన్ని, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️