గ్రామీణ భారత్‌ బంద్‌ సక్సెస్‌

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రధాని మోడీని గద్దె దించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పలువురు నేతలు కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ భారత్‌ బంద్‌- పారిశ్రామిక సమ్మె శుక్రవారం నిర్వహించారు. తొలుత కర్నూల్‌ రోడ్‌ ఫ్లైఓవర్‌ నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన ఆర్‌టిసి బస్టాండ్‌ , అద్దంకి బస్టాండ్‌, మస్తాన్‌ దర్గా, మిరియాల పాలెం సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు పేరిట ప్రధాని అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు అప్పగి స్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌. నారాయణ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఢిల్లీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో 13 నెలల పాటు సాగిన ఉద్యమం చారిత్రాత్మకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు, ఎఐటియుసి నాయకులు పివిఆర్‌.చౌదరి , ఐఎఫ్‌టియు నాయకులు ఆర్‌.మోహన్‌, ఎఐఎఫ్‌టియు నాయకులు ఎంఎస్‌.సాయి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘం జిల్లా నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సిపిఐ (ఎంఎల్‌) జిల్లా నాయకురాలు ఎస్‌.లలిత కుమారి , ఒపిడిఆర్‌ రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్‌ రావు, ఐఎల్‌పి జిల్లా నాయకులు దాసరి సుందరం, పిఒ డబ్ల్యు నాయకురాలు బి.పద్మ, కెఎన్‌పిఎస్‌ నాయకులు జార్జి, బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు రాజేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు ,టి.మహేష్‌ ,సిపిఎం నగర కార్యదర్శి జి.రమేష్‌, సిపిఐ జిల్లా నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్‌.వెంకట్రావు, కె.సుబ్బారావు, సుబ్బారావు పాల్గొన్నారు. కొండపి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కెజి. మస్తాన్‌, ఎపి మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి జి.వందనం, రూబెన్‌, అంగలకుర్తి బ్రహ్మయ్య, అంగన్‌ వాడీలు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలిగండ్ల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గ్రామీణ బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు రాయల మాలకొండయ్య , జిఎంపిఎస్‌ నాయకుడు ఖండే బాలకష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు తిరుపతయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పార్వతి, నారాయణమ్మ, ఇఒఎ నాయకురాలు జయలక్ష్మి, ఆశా వర్కర్లు రాణి, పద్మ, మనోరమ్మ, వెంకటేశ్వర్లు, రమేష్‌, మనోహర్‌ పాల్గొన్నారు. చీమకుర్తి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె నిర్వహించారు. తొలుత ఎన్‌ఎస్‌పి కాలనీ నుంచి హరిహరక్షేత్రం వరకూ ట్రాక్టర్‌, బైకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బెజవాడ శ్రీను, చిన్నపురెడ్డి, నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, కుమ్మిత శ్రీనివాసులరెడ్డి, కంకణాల వెంకటేశ్వర్లు, కౌలు రైతు నాయకులు ఓబులరెడ్డి, సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పొదిలి : దేశంలో కార్మికుల హక్కులు పరిరక్షించాలంటే బిజెపిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.రమేష్‌ తెలిపారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి కెవి.రత్నం , సిఐటియు మండల కార్యదర్శి బి.కోటేశ్వరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డి.సుబ్బయ్య, కెవి.నరసింహం, అల్లాభక్షు, అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు jఎం.శోభారాణి, నాయకులు శారధ, రమణమ్మ, నరసమ్మ, ప్రజావతి, నిర్మల, ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.పద్మ, నందిని, సివిల్‌ సప్లై యూనియన్‌ నాయకులు కె.ప్రసాద్‌, కె.వెంకటయ్య, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. కురిచేడు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామీణ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల గౌరవాధ్యక్షుడు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని 762 మంది రైతులు ప్రాణత్యాగం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీను, జార్జి, లక్ష్మయ్య, శాంసన్‌, ఝాన్సీరాణి, మరియమ్మ, యోగేశ్వరమ్మ, గౌసియా,అంజలి, చిట్టెమ్మ పాల్గొన్నారు. కనిగిరి : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాగనం పాలని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసికేశవరావు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి తెలిపారు. వామపక్ష,కార్మిక, రైతు సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ భారత్‌ బంద్‌ నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకుడు కష్ణమూర్తి, సిఐటియు నాయకులు బషీరా, ప్రసన్న, ప్రసాద్‌, ఖాదరవలి, శాంత కుమారి, రజిని, లిబరేషన్‌ జిల్లా నాయకులు పాలూరి రమణారెడ్డి, ఎఐటియుసి నాయకులు యాసిన్‌, రామారావు, మోహన్‌,బాలి రెడ్డి, కాశీం వలి, పవన్‌ ,సురేష్‌ పాల్గొన్నారు. టంగుటూరు : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పేరాబత్తిన శ్రీను, కొల్లాబత్తిన శ్రీనివాసులు, మల్లాల యానాది, ఐఎఫ్‌టియు నాయకులు వెంకట్రావు, రంగారావు తిరుమల, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బొడ్డు సతీష్‌, ఎఐటియుసి నాయకులు ప్రభాకర్‌, భాస్కర్‌, రైతు నాయకుడు వెంకట్రావు పాల్గొన్నారు. దర్శి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఎల్‌ఐసి, పోస్టల్‌ కార్యాలయాలను మూయించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దర్శి నియోజకవర్గ నాయకులు తాండవ రంగారావు, ఎఐటియుసి నాయకుడు మాడపాకుల రమేష్‌, నారాయణ, జూపల్లి కోటేశ్వరరావు, అంజయ్య, కరుణానిధి, నాగేశ్వరరావు, కోటయ్య, అంజిబాబు, కాలేబాషా, మోహన్‌రావు, అరుణ, తిరుపతమ్మ పాల్గొన్నారు. మద్దిపాడు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామీణబంద్‌, పారిశ్రామిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ఎఎంసి మాజీ చైర్మన్‌ మండవ రంగారావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి గద్దె దింపక పోతే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకుడు వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు కనపర్తి సుబ్బారావు, వెంకటరామిరెడ్డి, శేషయ్య, నరజర్ల శ్రీను, లారీ యూనియన్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాసరావు, రామరాజు, శ్రీనివాసరెడ్డి, సుబ్రహ్మణ్యం, రాధాకష్ణ, దిలీప్‌, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కాసిం, ఉబ్బా ఆదిలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొబ్బా వెంకటేశ్వర్లు, కెవిపిఎస్‌ మండల నాయకుడు కాకుమాను సుబ్బారావు, ఎఐటియుసి నాయకుడుఏ పావులూరి అంజయ్య, ఆటో యూనియన్‌ నాయకులు సుభాని, తెలుగు రైతు నాయకులు ఉమా మహేశ్వరరావు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. పిసిపల్లి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు మహేష్‌, విజయ కుమారి, బుజ్జి, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి, ఎన్‌.రత్నకుమారి, సిహెచ్‌.అజిస్‌, కుమార్‌, డి.రమేష్‌, వై.పేరయ్య, కొడవటికంటి కొండయ్య, ఎం.తిరుపాల్‌రెడ్డి, కుంబగిరి మాల్యాద్రి, పరిమి నారాయణ, పారా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్‌ : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కొప్పోలులో గ్రామీణ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకులు, పాఠశాలలు మూయించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు పెట్యాంల హనుమంతరావు, సిఐటియు నాయకులు మధిర ఆదినారరాుణ, జి. శ్రీనివాసరావు, బొడపాటి రాఘవరావు, ఆవుల మంద అంజి, జి.శ్రీనివాసరావు, వై. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిఎస్‌పురం రూరల్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష. కార్మిక, రైతు సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌ నిర్వహించారు. తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల గౌరవాధ్యక్షుడు ఎస్‌. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాగ నంపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు బి.జేసురత్నం, సిహెచ్‌.రఫియా, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గుర్రం లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. శింగరాయకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌, కార్మిక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు టంగుటూరి రాము, ఎఐటియుసి నాయకులు బాలకోటయ్య, బాలాజీరెడ్డి, ఎఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు కె.నాంచార్లు, సుల్తాన్‌, బాషా, అంబటి కొండలరావు, పులగర కష్ణయ్య పాల్గొన్నారు.జరుగుమల్లిలో.. శింగరాయకొండ : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుమల్లిలో గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సుబ్బారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య, సిఐటియు నాయకులు బెజవాడ శివయ్య, గుడిపూడి అంకయ్య, గుంతోటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.హనుమంతునిపాడు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌, ఎపిఫీల్డ్‌ అసిస్టెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు రాధమ్మ , అంగన్‌వాడీలు దారా స్వప్న, లలితమ్మ, అరుణ, మహాలక్ష్మి, గౌసియా, ఆదెమ్మ, మాధవి, సౌజన్య, నాగవేణి, కోటేశ్వరి,ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కొటికల తిరుపతయ్య,జీవన్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు పాల్గొన్నారు. పామూరు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె. గౌస్‌ బాషా ,జన విజ్ఞాన వేదిక నాయకుడు కె.శంకర్‌, నాయకులు శ్రీను, పుల్లయ్య, వెంకటేశ్వర్లు కరిముల్లా, ఖాసీం సాహెబ్‌ వీరనారాయణ, ఎఐటియుసి నాయకులు మౌలాలి, సుబ్బారావు, సూరిబాబు, ప్రభాకర్‌ పాల్గొన్నారు. ముండ్లమూరు : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు ,హనుమంతరావు, కొండలు, ఎర్రయ్య, రాజా రమేష,్‌ సత్యం, యాకూబ్‌ , అంగన్‌వాడీలు అజిత ,జ్యోతి, విజయలక్ష్మి ,జయశ్రీ, దీనమ్మ పాల్గొన్నారు దొనకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామీణ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కర్నా హనుమయ్య, కర్నా కృష్ణ, సిఐటియు కార్యకర్తలు కుందుర్తి అనీల్‌, మేళం సంతోష్‌, కొమరగిరి శ్రీను, కొండా ప్రాన్సీస్‌, మాలపోలు అంజిబాబు, పురుషోత్తం కాశయ్య, ఐలూరి రమణయ్య, ఆదాం, గుడిమెట్ల ఆనందరావు, వెంకటేశ్వర్లు, బండారు శ్రీకాంత్‌, గుడిమెట్ల దావీదు, రామయ్య, గుడిమెట్ల విజరుకుమార్‌, నరసింహులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రైతు,కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌ నిర్వహించారు. తొలుత బస్టాండ్‌ సెంటరులో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంతి బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా మోసం చేసినట్లు తెలిపారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ట్రాక్టర్లు, బైకులతో పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీకాంత్‌ , రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మారెళ్ళ వెంకట్రావు,జిజబసవపున్నయ్య, రైతులు పాల్గొన్నారు. కొత్తపట్నం : బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష, కార్మిక, రైతు సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.స్వామిరెడ్డి, నాయకులుశ్రీరాములు రెడ్డి, ప్రకాశం, బి.శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️