గ్రామ సేవలకు అంకితం: మంత్రి

Dec 28,2023 21:13

ప్రజాశక్తి-గుర్ల, చీపురుపల్లి : గ్రామాలలో సచివాలయాల పరిధిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, ఎవరికి ఏ అవసరం ఉన్నా హాజరవుతూ, ప్రజల సేవలకు అంకితమవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కోటగండ్రేడు గ్రామంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఇంటింటికీ కుళాయిలను కూడా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి, అహ్లాదకర మైన వాతావరణంలో విద్యాబోదన చేశామన్నారు. జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామ సచివాలయ పరిధిలో సుమారు రూ.16 కోట్లను సంక్షేమ పథకాల కింద అందించామన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలకు చేరు వగా సేవలను అందించేందుకు సచివాలయ వ్యవస్థ దోహదపడిందని చెప్పారు. గరివిడి మండలంలోని వెదుళ్లవలసలో వీటీ రోడ్డును ప్రారంభించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కార్య క్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎంఎల్‌సి డాక్టర్‌ పి.సురేష్‌బాబు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఆర్‌డిఒ బి.శాంతకుమారి, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ఉమాశంకర్‌, ఎంపిపి ప్రమీల, ఎంపిడిఒ కల్యాణి, తహశీల్దార్‌ పద్మావతి, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

➡️