ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా క్రిస్‌మస్‌ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చర్చిలను సుందరగా అలంకరించారు. క్రీస్తు సందేశాలను వినిపించారు.కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల వద్ద క్రిస్‌మస్‌ స్టార్లను ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించారు. మండలంలోని వెదురుమూడి, కాలేరు, కపిలేశ్వరపురం, నల్లూరు, అంగర, పడమరఖండ్రిక, మాచర, టేకి, కోరిమిల్లి, తాతపూడి గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఉప్పలగుప్తం మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో వైసిపి సీనియర్‌ నాయకుడు,గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ కుంచే రమణారావు పాల్గొని క్రిస్మస్‌ కేకులు కట్‌ చేసి సందేశం అందించారు. పేదలకు చీరలు, దుప్పట్లు, స్వీట్‌ బాక్స్‌లను రమణారావు అందజేశారు. ముమ్మిడివరం క్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని అనుచరించి ఆనందదాయక జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని టిడిపి ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలోని పార్టీ కార్యాలయంలో కాశి లాజర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సుబ్బరాజు పాల్గొని మాట్లాడారు. సాటిమానవుల పట్ల దయ, కరుణలతో మెలగడమే క్రీస్తు మార్గమన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, తాడి నరసింహారావు, అర్ధాని శ్రీనివాసరావు, చిక్కాల అంజిబాబు, బొక్కా రుక్మిణి, దాట్ల బాబు, పాయసం చిన్ని, యాళ్ల ఉదరు, తొత్తరమూడి జ్యోతి బాబు పాల్గొన్నారు.ఆలమూరు సమాజ శాంతి కోసం ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించాలని ఆలమూరు సర్పంచ్‌ ఎన్‌.లావణ్య కుమార రాజా, సొసైటీ డైరెక్టర్‌ చల్లా సత్యనారాయణ (నానాజీ) అన్నారు. ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్‌ వద్దగల సిబిఎం బాప్టిస్ట్‌ చర్చ్‌లో యు.జోసఫ్‌, కృప దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. జోసఫ్‌ క్రీస్తు జన్మదిన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో బొర్రా సూర్యారావు, చొప్పెల్ల యేసు, గొల్లపల్లి రాజు, యాళ్ల రవిరాజు, గంటా వీర్రాజు, గంటా కన్నరాజు, మూరా మణి రాజు, సావాడ దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కె.గంగవరం మండలంలోని శివల గ్రామంలోని కోనరేవు పాడు వద్ద షారోన్‌ స్వస్థత ప్రార్థనా మందిరంలో క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాస్టర్‌ ఎం.సంతోష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఘనత క్రిస్తుకే దక్కుతుందని, దేశంలో అశాంతి, మత విద్వేషాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని సందేశ మిచ్చారు.ముఖ్య అతిథిగా టి.ప్రసన్న విజరు కుమార్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్త ప్రశాంత్‌ కుమార్‌, జె.మోషే, ఎం.దొరబాబు, వాసంసెట్టి యోసేపు, పంపన ప్రకాష్‌రావు, కె.జాన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు.

➡️