ఘనంగా రామానుజన్‌ జయంతి

ఘనంగా రామానుజన్‌ జయంతి

ప్రజాశక్తి – యంత్రాంగం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పలుచోట్ల శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామర్లకోట రూరల్‌ బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో హెచ్‌ఎం ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామానుజన్‌ జీవిత విశేషాలు, నిజ జీవితంలో గణితం ప్రాముఖ్యతను వివరించారు. గణిత క్లబ్‌ ఆధ్వర్యంలో గణిత రంగోలి, రామానుజన్‌ శోభా యాత్ర, గణిత క్విజ్‌, మాథ్స్‌ టాలెంట్‌ హంట్‌, గణిత నృత్యాలు, గణిత శాస్త్రవేత్తల వేషధారణ, గణిత ప్రతిజ్ఞ తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. విజేతలకు రామానుజన్‌ మెడల్స్‌, గణిత పుస్తకాలు, సర్టిఫికెట్స్‌ను ఎంఇఒ పి.పుల్లయ్య,పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ చంద లాడ శ్రీనివాసరావు, అందించారు. గణిత టీచర్లు కె.అరుణ, డివిఆర్‌ఎన్‌.వల్లి, ఎ.శ్రీవల్లి, వి.రాజు, ఎఎల్‌.వి.కుమారి, కెవి.వి.సత్య నారాయణ, కె.శ్రీనివాస్‌, జి.శంకరం పాల్గొన్నారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణితానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నమూనాలు, పజిల్స్‌ ప్రదర్శన నిర్వహించారు. హెచ్‌ఎం వర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దత్తు,కుమార్‌,లక్ష్మీ లలిత, దుర్గాప్రసాద్‌, శ్రీలలిత, మహాలక్ష్మి, జగ్గారావు, శివన్నారాయణ పాల్గొన్నారు. గండేపల్లి ఆదిత్య క్యాంపస్‌లోని పలు కళాశాలల్లో వ్యాస రచన, ఉపన్యాసం, మ్యాథమెటిక్స్‌ ఛాలెంజ్‌, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌ మాట్లాడారు. కళాశాల భవనానికి రామానుజన్‌ భవనంగా పేరు పెట్టామని చెప్పారు. హెచ్‌బిఎస్‌ విభాగాధిపతి డాక్టర్‌ బి.జ్యోతి డీన్‌ డాక్టర్‌ రవికుమార్‌, గ్రంథాలయ అధికారి కె.అశోక్‌ కుమార్‌, కె.వెంకట రమణ, ఎస్‌.రమాశ్రీ, ప్రిన్సిపల్‌ డోలా సంజరు, కె.రవిశంకర్‌, డి.సతీష్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ విలాస్‌ అనిల్‌ చవాన్‌ పాల్గొన్నారు. కరప గురజనాపల్లి హైస్కూల్లో రామానుజన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెచ్‌ఎం ఎ.సాయి మోహన్‌, ఉపాధ్యాయుడు టి.వేణుగోపాల్‌, పి.శ్రీనివాస్‌, ఐ.ప్రసాదరావు, వివి.రమణమూర్తి, వి.శోభాకర్‌, జి.అర్జున్‌ రావు, మాణిక్యాంబ, ప్రభారాణి, లక్ష్మి, పద్మావతి, చంద్రావతి పాల్గొన్నారు.

➡️