చెర్లోయడవల్లిలో ఉచిత వైద్య శిబిరం

Dec 16,2023 22:30
వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం

వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం
చెర్లోయడవల్లిలో ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ :మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ ప్రమీల మాదమాల ఎం.బి.బి.ఎస్‌ , ఎం.డి. యుఎస్‌ఎ వారి చే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని 2017వ సంవత్సరం నుండి ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి మాజీ సర్పంచ్‌ కేతా విజయభాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరంలో సుమారు వందమందికి పైగా రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులను కూడా ఇవ్వడం జరిగింది. షుగర్‌, బి.పి వ్యాధిగ్రస్తులకు మూడు నెలలకు సరిపడా మందులను అందజేశారు. ఈ ఉచిత మందులను ఆలంబన ఫౌండేషన్‌- ఇండియా వారి సౌజన్యంతో సరఫరా చేయడం జరిగింది . ఈ శిబిరానికి చెర్లోయడవల్లి ఫౌండేషన్‌ చైర్మన్‌ అల్లంపాటి వెంకట రాజేష్‌ , అంబటి రాధాకష్ణారెడ్డి, చెర్లోయడవల్లి సచివాలయ సిబ్బంది ఏ.ఎన్‌.ఎం.శంషాద్‌ బేగం, మాధురి, విలేజ్‌ పోలీస్‌ సుప్రజ, ఆశా వర్కర్‌ కాంతమ్మ సహాయ సహకారాలు అందించారు.

➡️