జగనన్న కు చెబుదాంకు 210 వినతులు

Mar 4,2024 21:39

ప్రజాశక్తి-విజయనగరం కోట  : జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్‌లైన్‌లో పంపిన వినతులను పరిశీలించి వాటిపై స్పందించాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో సంయుక్త కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల, మురళీ కృష్ణ, ఆర్‌డిఒ సూర్యకళతో కలసి జిల్లా కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 210 వినతులు అందాయి. దశల వారీ వసూలు చేయాలినగరంలోని దుకాణదారుల వద్ద ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుముకు సంబంధించి చాలా ఏళ్లుగా బాకీ పడిన మొత్తాన్ని ఒకేసారి అపరాధ రుసుంతో కలిపి చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని, వారికి వాయిదాలుగా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్‌కు టిడిపి నాయకులు వినతినిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఐవిపి రాజు, రాజేష్‌బాబు, బొద్దలనర్సింగరావు, గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కనకల మురళీమోహన్‌, బంగారుబాబు పాల్గొన్నారు.7న రసాయనిక విపత్తులపై మాక్‌ డ్రిల్‌విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ఈనెల 7న రసాయనిక విపత్తుల (కెమికల్‌ డిజాస్టర్‌) పై మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. పూసపాటిరేగ మండలం చోడవర నున్న మైలాన్‌ లాబ్స్‌ వద్ద 7వ తేదీన ఉదయం 9 గంటల నుండి ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారని తెలిపారు. స్పందన అనంతరం కలెక్టరేట్‌ లో అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమానికి సంబంధించి టేబుల్‌ టాప్‌ ఎక్సర్‌సైజ్‌ ఈనెల 5న జరుగుతుందని, ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా సంబంధిత అధికారులు హాజరై వారి బాధ్యతలను, విధులను తెలుసుకోవాలని తెలిపారు. 7న అధికారులంతా మైలాన్‌ లాబ్‌కు హాజరు కావాలని తెలిపారు.

హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలి

విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు జీతాలు, హెల్త్‌ అలవెన్సె బకాయిలు వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు, నాయకులు బి .భాస్కరరావు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ లు చెల్లించకపోతే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఆప్కాస్‌ యేతర కార్మికులైన లీకులు, వాల్‌ ఆపరేటర్లు, ప్లాంటేషన్‌ కార్మికులు, ఆఫీస్‌ సబార్డినేటర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లకు 3నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయని, వీటన్నింటిని వెంటనే ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. సమస్యలపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేయనున్నట్లు తెలిపారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో గౌరీ, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు

6 వేలు పింఛను ఇవ్వాలి

వికలాంగులకు రూ.6వేలు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.తవిటి నాయుడు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ వికలాంగులకు, వృద్దులు, వితంతువులకు ఇతర సామాజిక పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అన్ని జిల్లాల్లో వికలాంగులకు సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.ఎస్‌.రహీమ్‌,బివి శ్రీనివాసరావు, ఎం.సత్తిబాబు తదితులు పాల్గొన్నారు.

➡️