జగనన్న గోరుముద్దలోనాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి

Dec 14,2023 19:33
భోజనం పరిశీలిస్తున్న దృశ్యం

భోజనం పరిశీలిస్తున్న దృశ్యం
జగనన్న గోరుముద్దలోనాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
ప్రజాశక్తి-కోవూరు :రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న జగనన్న గోరుముద్దలో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని మండల విద్యాశాఖ అధికారి-2 వై. చెంచులక్ష్మమ్మ అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలోని గుంటకట్ట ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం పాఠశాలలో జరుగుతోన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అన్నం వండే సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ఏజెన్సీలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పక అమలు చేయాలన్నారు.కలెక్టర్‌ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆమె వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

➡️