జనాకర్షణ లేకే పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారు

Dec 21,2023 21:31

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   టిడిపికి జనాకర్షణ లేకే పవన్‌ కల్యాణ్‌ను బతిమలాడుకొని తీసుకొచ్చారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. యువగళం సభకు పవన్‌ కళ్యాణ్‌ రానంటే 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి బతిమలాడుకొని సభకు తీసుకొచ్చిన దుస్తితి చంద్రబాబుది అని అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఓటు అడిగే హక్కు కోల్పోవడం వల్ల జనాకర్షణ కలిగిన పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణను తీసుకొచ్చారన్నారు. నీదగ్గర అధికారం తీసుకుంటే ఆ వ్యక్తి సైకో అవుతాడా అని ప్రశ్నించారు. గత నాలుగున్నర ఏళ్లలో 175 నియోజక వర్గంలో ఎప్పుడైనా సమస్యలపై ప్రశ్నించారా అని అన్నారు. తమ పాలనలో విద, వైద్యానికి పెద్దపీట వేశామన్నారు. బహిరంగ సభకు యావత్తు రాష్ట్రం నుంచి వస్తేగాని సభ పెట్టలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. విజయనగరం నియోజక వర్గంలో చేసిన అభివృద్ది పనులపై బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్‌ విసిరారు.

➡️