జెవివి ఆధ్వర్యాన చెకుముకి పరీక్షలు

జెవివి ఆధ్వర్యాన చెకుముకి పరీక్షలు

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన గురువారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు రెండో స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ పి.ఆర్‌.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.తిరుపాణ్యం చెకుముకి పరీక్ష బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. జెవివి అధ్యక్షుడు డాక్టర్‌ ఆలపాటి శ్రీనివాస్‌ మాట్లాడారు. రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావు విజయం సాధించిన విద్యార్థులను అభినదించారు. బివివి సత్యనారాయణ, ఒరుగంటి సత్యనారాయణ, స్వరూప్‌, యుఎస్‌ రెడ్డి, కామాడి ఈశ్వరరావు, పద్మావతి పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ భాష్యం విద్యార్థులు సీనియర్‌్‌స విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్‌ కుసిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. జూనియర్స్‌ విభాగంలో వర్షిక్‌ అభిరామ్‌, జెస్సికా మరియు సీనియర్స్‌ విభాగంలో సతీష్‌ బాబు, లలిత నాగలక్ష్మి, తేజశ్రీ ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. వీరిని విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, జోనల్‌ ఇన్చార్జ్‌ గోవిందరాజులు అభినందించారు. పిఠాపురం పట్టణంలోని స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో చెకుముకి కన్వీనర్‌ నేమిశెట్టి గంగబాబు ఆధ్వర్యాన పోటీలు నిర్వహించారు. సోషల్‌ వెల్ఫేర్‌ రిటైర్డ్‌ డిడి కె.అప్పారావు, ఎన్‌.శ్రీనివాస్‌, ఎన్‌.సూర్యనారాయణ, వి.సత్యనారాయణ రెడ్డి, సతీష్‌, గంగా పావని పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో నిర్వహించిన పోటీల్లో పలువురు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలల విభాగంలో జూనియర్‌, సీనియర్‌ విభాగంలో సామర్లకోట ప్రతిభ పాఠశాల విద్యార్థులు ప్రథమస్థాయిలో విజేతలుగా నిలిచారు. విజేతలకు ఎంఇఒలు వై.శివరామ కృష్ణయ్య, పి.పుల్లయ్య బహుమతులు, ప్రశంసాపత్రాలు, మొమెంటోలు అందచేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారికి తర్ఫీదునిచ్చిన సైన్స్‌ ఉపాధ్యాయులను పాఠశాల కరెస్పాండెంట్‌ ఎస్‌వివిజి.ప్రకాష్‌, డైరెక్టర్‌ సుధారాణి ప్రకాష్‌, ప్రిన్సిపల్‌ టి.సునీత, వైస్‌ ప్రిన్సిపల్‌ పి.శ్రీగౌరీదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️