జేవీవీ చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. టాలెంట్‌ టెస్ట్‌ ప్రశ్న పత్రాలను ఎంఈఓ-2 వెంకారెడ్డి విడుదల చేశారు. ఈ టెస్ట్‌కు మండలంలోని 12 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల విభాగంలో.. జడ్పీ హైస్కూల్‌ చిలకపాడు విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా, ఏపీఆర్‌ స్కూల్‌ సంతనూతలపాడు విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు.ప్రైవేటు పాఠశాలల విభాగంలో..శ్రీ శాంతినికేతన్‌ గంగవరం విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా శ్రీ గురుదత్త హైస్కూల్‌ పేర్నమిట్ట విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించారు. అనంతరం విజేతలకు బహుమతులను, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు పి రామారావు, జెవీవీ మండల కన్వీనర్‌ బి సాంబశివరావు, జిల్లా నాయకులు కే కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు ఎన్‌వి నరసింహం, నాయకులు రంగనాయకులు, విజయకుమారి, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️