టిడిపితోనే మహిళలకు గౌరవం

Mar 8,2024 21:52
ఫొటో : మాట్లాడుతున్న కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్యక్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్యక్రిష్ణారెడ్డి
టిడిపితోనే మహిళలకు గౌరవం
ప్రజాశక్తి-కావలి : మహిళలకు గౌరవం టిడిపితోనే సాధ్యమని కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి టిడిపి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని టిడిపి, పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్యక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. కేకును కట్‌ చేసి మహిళలకు పంచి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేసిందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు, మహిళల పేరు మీదనే పధకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఓర్పు, సహనం కలిగిన వారు మహిళలు అని అన్నారు. మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేశారు. బాబు షఉ్యరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మహిళలు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం, బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, నియోజకవర్గంలోని టిడిపి అనుబంధ పలు విభాగాల మహిళలు పాల్గొన్నారు.

➡️